జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం 40 మంది స్టార్ క్యాంపెయినర్స్ నియమించింది బీఆర్ఎస్ పార్టీ. అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు సహా.. 40 మంది సీనియర్ నేతల పేర్లను విడుదల చేసింది. నవంబర్ 11న జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గోపీనాథ్‌ను అధికారిక అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్ఎస్, క్యాంపెయిన్‌ను మరింత బలోపేతం చేయడానికి ఈ చర్య తీసుకుంది.
ఈ జాబితాలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, పి. సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్యేలు కలేరు వెంకటేష్, ముత్తా గోపాల్, మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు తదితరులు ఉన్నారు.
ఈ నాయకులు రోడ్ షోలు, పబ్లిక్ మీటింగులు, డోర్-టు-డోర్ క్యాంపెయిన్‌ల ద్వారా ఓటర్లను చేరుకుని, పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తారు. కేసీఆర్.. పార్టీ అభ్యర్థికి బీ-ఫారమ్ ఇంకా రూ.40 లక్షల చెక్‌ను అందజేసిన సందర్భంగా, ఈ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వంపై రిఫరెండమ్‌లా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్‌లోని 420 హామీలు ఓటర్లను మోసం చేశాయి. బీఆర్ఎస్ పాలనలో రైతులు, కార్మికులు, మహిళలు అందరూ ప్రయోజనాలు పొందారు’ అని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ క్యాంపెయిన్ ద్వారా బీఆర్ఎస్, సానుభూతి ఫ్యాక్టర్‌ను కూడా ఉపయోగించుకుని, జూబ్లీహిల్స్‌లో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీ వార్ రూమ్‌ను కూడా ఏర్పాటుచేసి, క్యాంపెయిన్ వ్యూహాలను రూపొందిస్తోంది.ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పునరుద్ధరణకు కీలకమైనవిగా మారతాయని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..








