ఆర్మూర్ పెర్కిట్‌లోని కుంటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వెలికితీత….

On: Saturday, December 6, 2025 8:15 PM

 

A9 న్యూస్ ప్రతినిధి – ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జాన్‌డీర్ ట్రాక్టర్ షోరూమ్ వెనుక ఉన్న కుంటలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం ప్రత్యక్షమై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వయసు అందజాగా 45 నుంచి 50 సంవత్సరాలు ఉండే ఆ వ్యక్తి శవాన్ని పోలీసులు కుంట నుండి వెలికి తీసి, ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్ట్‌లో భద్రపరిచారు. మృతుడి గుర్తింపు ఇంకా తెలియరావడంతో పోలీసులు విచారణను ప్రారంభించారు.

ఈ వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

18 Jan 2026

Leave a Comment