ఆలూరు జెడ్పిటిసి బరిలో బిజెపి అభ్యర్థి సుభాష్……

On: Tuesday, October 7, 2025 3:42 PM

 

కమల జెండా ఎగరడం ఖాయమని ప్రజలు నమ్మకం.

A9 న్యూస్ ఆర్మూర్:

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండలంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈసారి ఆలూరు జెడ్పిటిసి స్థానం నుండి బిజెపి తరఫున సుభాష్ బరిలో నిలవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.

సుభాష్ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధిష్టానం ఖరారు చేయడం తో మండలవ్యాప్తంగా బిజెపి కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ప్రజా సమస్యలను అర్థం చేసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తూ, అభివృద్ధి పథంలో ఆలూరు మండలాన్ని ముందుకు తీసుకువెళ్లాలనే దృఢ సంకల్పంతో సుభాష్ ముందుకు సాగుతున్నారు.

యువత, రైతులు, మహిళలు, సాధారణ ప్రజలలో ఆయనకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలతో మమేకమవుతున్న ఆయనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోంది. “ఈసారి ఆలూరులో కమల జెండా ఎగురుతుంది, సుభాష్ గెలుపు ఖాయం” అంటూ బిజెపి కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో నమ్మకం పెంచాయని, ఆ నమ్మకాన్ని సుభాష్ గారు మరింత బలపరుస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజాసేవే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతుండటంతో ప్రజల మద్దతు మరింతగా పెరుగుతోంది.

“ఆలూరు మండల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న బిజెపి అభ్యర్థి సుభాష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించి, ఆలూరులో కమల జెండా ఎగరడం మనందరి బాధ్యత” అని పార్టీ నాయకులు, కార్యకర్తలు పిలుపునిస్తున్నారు.

11 Nov 2025

Leave a Comment