సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి – జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాసరావు…

On: Sunday, October 12, 2025 9:40 PM

 

ఎ9 న్యూస్ మెదక్ అక్టోబర్ 12

ప్రజలు సైబర్ నేరల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని జిల్లా పోలీస్ అధికారి ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, తెలియచేశారు. ఇటీవల జరుగుతున్న నేరలను గురించి ప్రస్తావిస్తూ, లోన్ యాప్ మోసాలు, జాబ్ ఫ్రాడ్స్, APK ఫైల్స్ ద్వారా డేటా దొంగతనం, అలాగే బిట్‌కాయిన్ / క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు.

లోన్ యాప్ మోసాలు:

తక్కువ వడ్డీతో వెంటనే లోన్ ఇస్తామని చెప్పి కొన్ని యాప్‌లు ప్రజల మొబైల్ ఫోన్‌లో వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి తరువాత డబ్బులు వసూలు చేయడమే కాకుండా, ఫోటోలు, కాంటాక్ట్‌లు ఉపయోగించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్‌ లేదా అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేయాలని సూచించారు.

జాబ్ ఫ్రాడ్స్:

ఉద్యోగం ఇస్తామనే నెపంతో కొంతమంది మోసగాళ్లు సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా డబ్బులు అడిగి మోసం చేస్తున్నారు. ఏ విధమైన ఫీజులు ముందుగా చెల్లించవద్దని, ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లలో మాత్రమే అప్లై చేయాలని ప్రజలకు సూచించారు.

APK ఫైల్స్ మోసం:

తెలియని లింకుల ద్వారా APK ఫైల్ ఇన్‌స్టాల్ చేయడం ద్వారా ఫోన్‌లోని ఫోటోలు, బ్యాంక్ వివరాలు, OTPలు హ్యాకర్లకు చేరే ప్రమాదం ఉందని చెప్పారు. తెలియని వ్యక్తుల లింకులు క్లిక్ చేయవద్దని హెచ్చరించారు.

బిట్‌కాయిన్ / క్రిప్టో మోసాలు:

తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి అనధికారిక వెబ్‌సైట్‌లలో ఇన్వెస్ట్ చేయమని ఆకర్షించే మోసగాళ్లను నమ్మరాదని సూచించారు. ఇటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్‌ చట్టబద్ధమైనవి కావని, ప్రజలు ఆర్థిక నష్టాలు చవిచూడకుండా జాగ్రత్తపడాలని తెలిపారు.

సైబర్ మోసాలకు గురైనవారు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 నంబర్‌కి కాల్ చేయవచ్చు లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు.

గోల్డెన్ అవర్స్ లో పిర్యాదు చేసినట్లయితే మీ డబ్బులను వేరే ఖాతాలోకి వెళ్లకుండా ఫ్రీజ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని తెలిపారు.

జిల్లా ఎస్పీ ప్రజలు సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తగా ఉండాలని, మెసేజ్‌లు, కాల్స్‌ నమ్మవద్దని తెలియని లింక్ లను క్లిక్ చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు.

11 Nov 2025

Leave a Comment