బీసీ బందు పిలుపుకు-నిరుపేద హక్కుల సాధన సమితి కమిటీ సంపూర్ణ మద్దతు….  

On: Friday, October 17, 2025 10:47 AM

 

సిద్దిపేట మూర్తి ఆగి రెడ్డి జిల్లా కన్వీనర్ వెల్లడి.

ఎ9 న్యూస్ సిద్దిపేట అక్టోబర్ 17

ప్రియమైన ప్రజలారా ,స్వామిక వాదులారా! 17 -10 -2025.  న జరగబోయే ” బీసీ బందుకు ” తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తుంది.నిరుపేద హక్కుల సాధన సమితి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. కులాలు, మతాలుగా మనుషులను విడగొట్టి వారిని ఎల్లకాలం బానిసలుగా చూడాలి అనుకున్న టువంటి ఒక మతతత్వ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మన రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం వ్యక్తి స్వేచ్ఛ సమాజ స్వేచ్ఛ హక్కులు ఇవన్నీ పొందుపరచబడ్డాయి. సామాజికంగా వెనుకబడినటువంటి కులాలకు తప్పనిసరిగా రిజర్వేషన్స్ దక్కవలసిందే. అయితే ఇక్కడ వచ్చిన చిక్కు ఏమిటంటే కేవలం గతంలో ఎస్సీ ఎస్టీ సోదరులు చదవడం కోసం, ఉద్యోగాల కోసం మాత్రమే రిజర్వేషన్స్ అడగడం జరిగింది. ఇప్పుడు బీసీలు అంటే బ్యాక్ వార్డ్ క్లాస్ కు చెందినవారు. ఇవి అన్నింటితో పాటు రాజకీయపరంగా రాజకీయ రిజర్వేషన్స్ కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది అగ్రవర్ణ దృహంకారులకు పనిగట్టుకొని బీసీ రిజర్వేషన్స్ మీద అడ్డు పుల్లలు వేయడం జరుగుతుంది. న్యాయబద్ధంగా ఈ దేశంలో ఎవరి వాటా వారికి దక్కవలసిందే. అందులో ఎస్సీ, ఎస్టీ బీసీలు ఎంబీసీలు మరియు అగ్రవర్ణ పేదలు కూడా ఎవరి వాటా వారికి దక్కవలసిందే కాబట్టి, న్యాయమైన బీసీల యొక్క 42 శాతం రిజర్వేషన్ స్కై మా నిరుపేద హక్కుల సాధన సమితి బీసీల యొక్క ఈ బందుకు సంపూర్ణ మద్దతును తెలియజేస్తుంది.

ఇట్లు/

నిరుపేదల హక్కుల సాధన సమితి ,

సిద్దిపేట జిల్లా కన్వీనర్ కమిటీ ,

జిల్లా కన్వీనర్ మూర్తి ఆగి రెడ్డి.

11 Nov 2025

Leave a Comment