ఎ9 న్యూస్ ,నర్సాపూర్, సెప్టెంబర్ 20:
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి నర్సాపూర్ క్యాంప్ కార్యాల యంలో నర్సాపూర్, ఎల్దుర్తి మండలాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన మొత్తం ₹12,78,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ:
“ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సీఎంఆర్ఎఫ్ సహాయం మాకు నిజమైన భరోసాగా నిలిచింది. వైద్య ఖర్చుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న మా కుటుంబాలకు ఇది ఆశాకిరణంగా మారింది. ఈ సహకారం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఎల్లప్పుడూ మా సమస్యలను పట్టించుకుని, సీఎంఆర్ఎఫ్ సహాయం అందేలా కృషి చేసిన నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.








