A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని మిర్ధాపల్లి గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం 6:00 గంటల సమయంలో పోలీసులు ఆకస్మిక దాడి చేశారు.
బొడ్డు ఆంజనేయులు అనే వ్యక్తి యొక్క రేకుల షెడ్డులో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు.
దాడిలో 48,800/- రూపాయలు నగదు, రెండు మోటార్ సైకిళ్లు, ఒక కారు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.








