ఆర్మూర్ 10వ వార్డుకు కౌన్సిలర్‌గా నూగురు జ్యోతి పోటీ – పేదల పక్షాన పోరాటమే లక్ష్యం

On: Friday, January 23, 2026 7:07 PM

ఆర్మూర్ 10వ వార్డుకు కౌన్సిలర్‌గా నూగురు జ్యోతి పోటీ – పేదల పక్షాన పోరాటమే లక్ష్యం

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డుకు కౌన్సిలర్‌గా పోటీ చేయడానికి నూగురు జ్యోతి ముందుకు వచ్చారు. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే, పేదలు-బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడతానని ఆమె తెలిపారు. కెనాల్ బౌండ్రి ప్రాంతంలో నివసిస్తున్నామనే కారణంతో ప్రజలను ఎక్కడికెళ్లినా చిన్నచూపు చూస్తున్నారని, ఆ వివక్షను తొలగించడమే తన ప్రధాన లక్ష్యమని నూగురు జ్యోతి పేర్కొన్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ, వార్డు ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించి, 10వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆమె స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి తప్పనిసరిగా గెలిపించాలని వార్డు ప్రజలను నూగురు జ్యోతి వినమ్రంగా కోరారు.

15 Feb 2026

Leave a Comment