బ్యాంకులో ఎక్కువ డబ్బులు వేస్తున్నారా?.. ఆ ప‌రిమితి దాటితే చిక్కులే.. ఐటీ నోటీసులు రావచ్చు…..

On: Saturday, October 18, 2025 7:06 AM

 

*సేవింగ్స్ ఖాతాల్లో రూ.10 లక్షలు దాటితే ఐటీకి సమాచారం.

*అన్ని బ్యాంకు ఖాతాల్లో కలిపి ఈ పరిమితి వర్తింపు.

*ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.10 లక్షలు దాటినా పైకి నివేదిక.

*మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో రూ.10 లక్షల పెట్టుబడులపైనా దృష్టి.

*సాధారణంగా బ్యాంకు SB ఖాతాల్లో డబ్బు జమ చేయడం, విత్‌డ్రా చేయడం సహజం అయితే, ఒక సంవత్సరంలో మీ అన్ని సేవింగ్స్ ఖాతాల్లో కలిపి జమ చేసిన మొత్తం రూ.10 లక్షలు దాటితే, ఆ సమాచారాన్ని బ్యాంకులు నేరుగా ఆదాయ పన్ను విభాగానికి తెలియజేస్తాయి.

*ఒకే ఖాతాలో కాకుండా వేర్వేరు ఖాతాల్లో జమ చేసినా, మీ పాన్ కార్డు ఆధారంగా అన్నింటినీ కలిపి లెక్కిస్తారు.

*నోటీసులు ఎప్పుడు వస్తాయి?.

*ఈ లావాదేవీల వివరాలు ఐటీ శాఖ వద్దకు చేరినప్పుడు, మీ ఐటీ రిటర్నుల్లో చూపిన ఆదాయంతో పోల్చి చూస్తారు. రెండింటి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటే, వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

*కాబట్టి, పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు వాటికి సంబంధించిన సరైన ఆధారాలు, పత్రాలు ఉంచుకోవడం చాలా ముఖ్యం.

11 Nov 2025

Leave a Comment