నేటి నుండి టెట్ పరీక్షలకు దరఖాస్తులు…..

On: Saturday, November 15, 2025 1:31 PM

 

హైదరాబాద్:నవంబర్ 15

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విద్యాశాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది.టెట్ పరీక్ష కోసం అభ్యర్థులు నవంబర్ 15 అంటే ఈరోజు నుంచి ఈ నెల 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది.మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది సమాచార పత్రాన్ని ఈరోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు….

ఉపాధ్యాయ అర్హత పరీక్షలను వచ్చే సంవత్స రం.. జనవరి 3-01-2026 నుంచి 31 మధ్య నిర్వహిం చనున్నారు.ఉపాధ్యాయ ఉద్యోగాలకు సిద్ధమవుతు న్న అభ్యర్థులు ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకో వాలని, విద్యాశాఖ సంచాలకులు చైర్మన్ నవీన్ నికోలస్, సూచించారు.

పేపర్-1: ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించడానికి.

పేపర్-2: ఆరో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించడానికి.

టెట్ పరీక్షను ఏటా రెండుసార్లు తప్పనిసరిగా నిర్వహించాలనే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధన ఉన్నప్పటికీ.. గత బీఆర్‌ ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో కేవలం నాలుగు సార్లు మాత్రమే టెట్ జరిగింది.

ఈ నిర్లక్ష్యంపై విమర్శలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా విద్యాశాఖ అధికారులను ఆదేశించి.. ఏటా రెండు సార్లు టెట్ నిర్వహించేలా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారని తెలుస్తుంది.

16 Dec 2025

Leave a Comment