అంకాపూర్ సమీపంలో ఆటో బండి ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి, పలువురికి గాయాలు…

On: Tuesday, December 23, 2025 7:35 AM

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణ పరిధిలోని అంకాపూర్ గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో బండి ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన వారు నిజామాబాద్ నగరానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వారు క్యాటరింగ్ పనుల నిమిత్తం వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదంలో సాయికుమార్ అనే వ్యక్తి ఘటన స్థలంలోనే మృతి చెందినట్టు తెలుస్తోంది. అతడు ఆర్మూర్‌లో బీటెక్ చదువుతున్న విద్యార్థిగా సమాచారం ఉంది. మరో వ్యక్తి మృతి చెందిన వివరాలు ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

13 Jan 2026

Leave a Comment