పరుగులో బంగారం – జంప్, త్రోలో కాంస్యం
సిద్ధార్థ హైస్కూల్ నందిపేట్ స్టూడెంట్.
ఆర్మూర్, ఆగస్ట్ 25, 2025:
నందిపేట్ మండలంలోని వన్నెల్(కే) గ్రామానికి చెందిన షేక్ అనాస్ తన అథ్లెటిక్స్ ప్రతిభతో మరోసారి మెరిసాడు. సిద్ధార్థ హైస్కూల్ నందిపేట్ లో 9వ తరగతిలో చదువుతున్న అనాస్, ఇటీవల నాగారంలో జరిగిన అండర్-14 అథ్లెటిక్స్ మీట్‌లో ప్రతిభ చాటాడు.
గత 23వ తేదీన జరిగిన ఈ పోటీలో అనాస్ 60 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం, లాంగ్ జంప్ మరియు బ్యాక్ త్రో పోటీల్లో కాంస్య పతకాలు సాధించి మూడు విభాగాల్లో పతకాలు దక్కించుకున్నాడు.
తన విజయం ద్వారా పాఠశాలకు గర్వకారణంగా నిలుస్తున్న అనాస్‌ను పాఠశాల కరస్పాండెంట్ దేవన్న, డైరెక్టర్ వంశీ, ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్, వ్యాయామ ఉపాధ్యాయుడు రంజిత్, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. ఆటల పట్ల ఆసక్తి, శ్రమ, పట్టుదలతో అనాస్ ఇలా విజయాలు సాధిస్తున్నాడని వారు అభిప్రాయపడ్డారు.








