*షేక్ షబ్బీర్ రిటైర్మెంట్ వేడుక ఘనంగ
ఆర్మూర్. అక్టోబర్ 01,
ఆర్మూర్ తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా 32 ఏళ్లపాటు అంకితభావంతో సేవలందించిన షేక్ షబ్బీర్ ఉద్యోగ విరమణ సన్మానోత్సవం అక్టోబర్ 31వ తేదీన పట్టణ శివారులోని ప్లాజా గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ సభాధ్యక్షత వహించగా ,సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సీఐ సత్యనారాయణ విశిష్ట అతిథులుగా ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ వినోద్, డిప్యూటీ తహసీల్దార్ సుజాత, రిటైర్డ్ తహసీల్దార్ గోపు మోహన్ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు.
నందిపేట్, మాక్లూర్, నవీపేట్ ,మోర్తాడ్ ,ఆర్మూర్ మండలాల్లో విధులు నిర్వహిస్తూ ప్రజా సేవలో ప్రతిభ చూపిన షేక్ షబ్బీర్ ని సత్కరించిన సందర్భంగా ఇతని సేవలను ప్రసంగకులు హృదయపూర్వకంగా కొనియాడారు.
సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా మాట్లాడుతూ:
తహసీల్దార్ కార్యాలయంలో ప్రజలతో సర్టిఫికెట్ల ఆధారంగా పని చేయడం చాలా సవాలుతో కూడినది. కానీ షబ్బీర్ 32 సంవత్సరాలపాటు ఎలాంటి రిమార్కులు లేకుండా ప్రజల మనసు గెలుచుకున్నారు.శారీరక అంగవైకల్యం, కుటుంబ సమస్యలు ఉన్నా తన విధుల్లో ఎప్పుడూ తగ్గిపోలేదు.ఆయన సేవలు ఆదర్శంగా నిలిచాయి అన్నారు.
ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ :
ప్రజల సమస్యలను తనవిగా భావించి సలహాలు, సూచనలు ఇచ్చిన షబ్బీర్ నిజమైన ప్రజాసేవకుడు. వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నప్పటికీ సేవలో నిబద్ధత చూపినటు వంటి ఉద్యోగి రిటైర్ కావడం రెవెన్యూ శాఖకు తీరని లోటు అన్నారు.
ఈ కార్యక్రమంలో వన్నెల్ (కే) గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు జింధం నరహరి,రేగుల సదానందం సమన్వయకర్తలుగా వ్యవహరించారు.
తన స్వగ్రామం వన్నెల్ (కే)తో పాటు పరిసర గ్రామాల ప్రజలు లబ్ధిదారులు మైనార్టీ సోదరులు, మున్సిపల్ కౌన్సిలర్లు, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది,బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై శాలువాలు, పూలమాలలతో, ఘనంగా సత్కరించి, ఉద్యోగ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.








