ఈ రోజు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా ZPHS మామిడిపల్లి పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిబంధనలు, రోడ్డు భద్రతా చర్యలు మరియు మైనర్ డ్రైవింగ్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించటం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఈ నియమాలను తమ తల్లిదండ్రులకు కూడా తెలియజేయాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎంవీఐ రాహుల్, ట్రాఫిక్ ఎస్‌ఐ రఘుపతి, టౌన్ ఎస్‌ఐ అప్పారావు పాల్గొని విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు అందించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








