ఆలూరు మండలంలోని ఆలూరు,గుత్ప గ్రామాల్లో కలిపే రహదారిపై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపొర్లి రహదారి పూర్తిగా మునిగిపోయింది నీటి ప్రవాహం దృతంగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆలూర్ ఎంపీఓ రాజలింగం గొప్ప, పంచాయతీ కార్యదర్శి రానా తరణం ఈ రహదారిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు ఎవరు ఈ బ్రిడ్జిపై లేదా రహదారిపై ప్రయాణించవద్దని హెచ్చరించారు. ఈ భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని తెలిపారు.








