పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనము 2010-2011…..

On: Monday, October 13, 2025 7:11 AM

జక్రాన్ పల్లి మండలంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో విద్యార్థులు మాట్లాడుతూ దాదాపు 15సంవత్సరాల తర్వాత అందరిని కలిసినందుకు సంతోషంగా ఉందని అన్నారు,అలాగే చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులను గుర్తుంచుకొని ఆహ్వానించామని వాళ్ళు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు,

అనంతరం ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ చదువుకునే సమయంలో చేసినటువంటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ 15సంవత్సరాల తరువాత మళ్ళీ కలవడం కలగా ఉందని గురువులు చెప్పినటువంటి మంచి మాటలను మళ్ళీ తిరిగి గుర్తు చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు, అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ మేము చదువు చెప్పినటువంటి విద్యార్థులు అందరూ మంచి ఉన్నత స్థాయిలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని అలాగే ఇంకా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని, మేము చెప్పినటువంటి మాటలు దృష్టిలో ఉంచుకొని 15సంవత్సరాల తర్వాత మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు,అనంతరం ఉపాధ్యాయులకు విద్యార్థులు శాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో 2010-2011బ్యాచ్ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు….

11 Nov 2025

Leave a Comment