తెలంగాణ తరపున ప్రాతినిధ్యం వహించనున్న ప్రతిభావంతురాలు.
నిజామాబాద్, సెప్టెంబర్ 03:
నందిపేట్ మండలం వన్నెల్ (కే) గ్రామానికి చెందిన ఐశ్వర్య జూనియర్ జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనబోతున్నట్టు జిల్లా బాస్కెట్‌బాల్ సంఘ అధ్యక్షులు శ్రీ రాజేందర్ రెడ్డి గారు మంగళవారం వెల్లడించారు.
ఈ టోర్నమెంట్ ఈ నెల 2వ తేదీ నుండి 9వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలోని లుధియానా నగరంలో జరగనుంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించే అర్హతను ఐశ్వర్య సంపాదించుకుంది.
ఈ సందర్భంగా ఐశ్వర్యను ఆమె కోచ్ బొబ్బిలి నరేష్ గారు ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక ప్రజలు, బాస్కెట్‌బాల్ సంఘ సభ్యులు ఐశ్వర్య ప్రతిభపై గర్వం వ్యక్తం చేశారు. గ్రామస్థులూ, అభిమానులూ ఆమెకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు.







