A9 న్యూస్ ప్రతినిధి ఇందల్వాయి:
ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ పరిశీలించారు. జిల్లాలో నష్టపోయిన పంటలపై వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓ) సర్వే చేపడుతున్నారని, వివరాలను ప్రభుత్వానికి సమర్పించి రైతులకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నానో యూరియా పై అవగాహన:
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని తనిఖీ చేసి, రైతులకు నానో యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు.
నానో యూరియా వాడకం వలన పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతుంది.
నేల సారాన్ని పెంపొందించి, మొక్కలకు సమర్థవంతంగా నత్రజని అందుతుంది.
పంటల దిగుబడి పెరుగుదలకు దోహదం చేస్తుంది.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రశాంత్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.








