మండల లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా న్యాయవాది సెయింట్ పాల్ బబ్లూ – ఆంప్స్ ఆధ్వర్యంలో ఘన సన్మానం…..

On: Tuesday, November 4, 2025 7:14 AM

 

A9 న్యూస్ ప్రతినిధి, ఆర్మూర్:

ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలోని మామిడిపల్లి శివారులో గల సెయింట్ పాల్ పాఠశాలలో సోమవారం రోజు ఆర్మూర్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీకి సభ్యుడిగా నియమితులైన న్యాయవాది సెయింట్ పాల్ బబ్లూను ఆర్మూర్ మున్సిపల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (ఆంప్స్) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.

ఈ సందర్భంగా ట్రస్మ జిల్లా అధ్యక్షుడు పొలపల్లి సుందర్, ఆంప్స్ అధ్యక్షుడు భారత్ చంద్ర మల్లయ్య, స్కాలర్స్ వేణు, నలంద ప్రసాద్, జెంటిల్ కిడ్స్ ప్రకాష్, భార్గవి గోపి కృష్ణ, ప్రజ్ఞ వంశీ తదితరులు పాల్గొన్నారు.

విద్యా రంగంలో, న్యాయ సేవలలో బబ్లూ కృషిని అందరూ ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజా సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

11 Nov 2025

Leave a Comment