ఆర్మూర్‌లో ఎంవిఐ లంచం కేసులో ఎసీబీ వలలో చిక్కాడు……

On: Thursday, August 21, 2025 4:14 PM

 

నిజామాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతి తగ్గకపోయినా, అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వరుస దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి రూ.25,000 లంచం స్వీకరిస్తూ గురువారం రంగే హస్తాలపై పట్టుబడ్డారు.

నిజామాబాద్ కేంద్రానికి చెందిన ఒక ఆర్టీవో ఏజెంట్ వద్ద ఫైల్‌పై సంతకం కోసం ఎంవిఐ లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా, ఉచ్చుపన్నిన అధికారులు నోట్ల సొమ్ముతో వివేకానంద్ రెడ్డిని పట్టుకున్నారు.

ఈ వివరాలను ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ గౌడ్ మీడియాకు వెల్లడించారు. ఇంకా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

21 Jan 2026

Leave a Comment