జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో నారాయణ నర్మద కళాశాల విద్యార్థిని ఎంపిక..

On: Friday, January 23, 2026 11:22 AM

 

ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లికి చెందిన దేశెట్టి సన్నిత మహిళ సీనియర్ జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలలో పాల్గొంటున్నట్లు సాఫ్ట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ మరియు సుజాత స్పష్టం చేశారు. హైదరాబాదులోని నారాయణ నర్మద కళాశాలలో చదువుతున్న దేశెట్టి సన్నిత ఆంధ్రప్రదేశ్ లోని అనంతపూర్ జిల్లాలో R.D.T క్రీడా మైదానంలో ఈనెల 24 నుంచి 27 వరకు జరిగే పోటీలలో ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లా నుంచి మొత్తం ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని పేర్కొన్నారు. జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన సన్నితను కళాశాల యాజమాన్యం అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు..

15 Feb 2026

Leave a Comment