రోడ్డు ప్రమాదంలో ప్రభాకర్ అనే వ్యక్తి మృతి…..

On: Sunday, October 19, 2025 10:36 AM

 

జక్రాన్ పల్లి మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ (45) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మాధపూర్ కి చెందిన ప్రభాకర్ కి భార్య ఒక కుమారుడు రామ్ చరణ్ (17)ఉన్నారు,ప్రభాకర్ వేరే గ్రామాల్లో ఇళ్ళు నిర్మించే పని చేస్తూ ఉంటాడని శుక్రవారం రాత్రి పని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో రోడ్డుపై ఉన్న వరి దాన్యం కుప్పకు ఎటువంటి ప్రమాద సూచనలు పెట్టకపోవడం వల్లే ధ్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రభాకర్ ఎగిరి పడటంతో తలకు తీవ్ర గాయం కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందాడు,కుటుంబ సభ్యులు రోదిస్తూ రోడ్డుపై వరిధాన్యం పోసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాపోయారు…..

11 Nov 2025

Leave a Comment