ప్రతిభావంతులైన గురువులకు ఘన సన్మానం….

On: Saturday, August 23, 2025 6:30 AM

 

ఆర్మూర్, A9 న్యూస్ ప్రతినిధి:

ఆలూరు మండలంలో బుధవారం నిర్వహించిన టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ (TLM) పోటీల్లో మిర్ధపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ప్రతిభ కనబరిచి మూడు అవార్డులను సాధించారు. జిల్లా స్థాయిలో పోటీలకు ఈ ముగ్గురు ఎంపిక కావడం గర్వకారణంగా మారింది.

అవార్డులను అందుకున్నవారిలో ప్రధానోపాధ్యాయులు రాజు , ఉపాధ్యాయులు రాజేందర్ రెడ్డి  మరియు శ్రావణి  ఉన్నారు. వీరి విజయం పట్ల గ్రామస్తులు, పేరెంట్స్ కమిటీ వారు వారు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో నూతపల్లి గంగాధర్, రఘు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి మరియు విద్యా విధానాల్లో వినూత్నత ప్రశంసనీయం అని కార్యక్రమంలో పాల్గొన్నవారు పేర్కొన్నారు.

21 Jan 2026

Leave a Comment