హైదరాబాద్ :అక్టోబర్ 22
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉండాలన్న నిబంధనను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వము ఆర్డినెన్స్ జారీ చేయనుంది, ఈ మేరకు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 21 (3)ని సవరించేందుకు ఇటీవల క్యాబినెట్ నిర్ణయించింది
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీ చేయరాదన్న నిబంధన తొలగింపు ప్రక్రియ వేగంగా సాగుతోంది. గురువారం కేబినెట్‌లో తుది నిర్ణయం తీసుకొని ఆర్డినెన్స్ జారీ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చట్టసవరణ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే రానున్న పంచాయతీ ఎన్నికల్లోనే ఈ నిబంధన అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరికి మించి సంతానం ఉన్న వారు కూడా పోటీ చేసేందుకు మార్గం సుగమం కానుంది. పంచాయతీరాజ్, పురపాలక చట్టాల సవరణపై గురువారం జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని ఈనెల 16న నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం చట్టసవరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించింది.
ఈమేరకు పంచాయతీ రాజ్, పురపాలక శాఖలు కేబినెట్ సమావేశంలో పెట్టేందుకు ప్రతిపాదనలు సమర్పించాయి. ఫైల్పై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు.ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణ చేయాలని : ఈ ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం చేస్తే ఈ గురువారం కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి చట్టసవరణకు నిర్ణయం తీసుకోనున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు. ఈ కారణంగా ఆర్డినె న్స్ ద్వారా చట్టసవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని కేబినెట్ ఆమోదించిన తర్వాత ముసాయిదా ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపించనున్నారు. గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే రాను న్న పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనే దీనిని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.








