నిజామాబాద్: అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరామ్ మహిపాల్ చారి ఈరోజు విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో నివసిస్తున్న విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మలు అందరూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా జీవించాలని విశ్వకర్మ భగవానుని కోరుకున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహాసభ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ చారి, కోశాధికారి బెజ్జారం నర్సయ్య చారి, వివిధ సంఘాల నాయకులు, విశ్వబ్రాహ్మణులు, స్వర్ణకారులు పాల్గొన్నరు.







