జక్రాన్పల్లి మండలంలో చిరుత మృతి కలకలం…..

On: Tuesday, September 2, 2025 7:46 AM

 

గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా చిరుత బలి.

A9 న్యూస్ ప్రతినిధి జక్రన్ పల్లి:

నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పడకల్ సమీపంలో 44వ జాతీయ రహదారి దాటుతున్న చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఢీ కొట్టిన ప్రభావానికి చిరుత అక్కడికక్కడే మృతి చెందింది.

సమాచారం అందుకున్న ఎస్ఐ మాలిక్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం చిరుత మృతదేహాన్ని పంచనామా నిమిత్తం వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. జాతీయ రహదారులపై వన్యప్రాణుల రాకపోకలకు రక్షణ చర్యలు అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

15 Mar 2026

Leave a Comment