విద్యాసంస్థల్లో అలజడి సృష్టిస్తే క్రిమినల్ కేసులు: పోలీస్ కమిషనర్ హెచ్చరిక…..

On: Thursday, July 2, 2026 10:09 PM

* విద్యాసంస్థల్లో అలజడి సృష్టిస్తే క్రిమినల్ కేసులు: పోలీస్ కమిషనర్ హెచ్చరిక….

A9 న్యూస్

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో అనుమతి లేకుండా ప్రవేశించి బంద్‌లు నిర్వహించడం, ఆస్తులు ధ్వంసం చేయడం, విద్యార్థులు మరియు సిబ్బందిని బెదిరించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య హెచ్చరించారు. డిచ్‌పల్లి పరిధిలోని నారాయణ విద్యాసంస్థ, వర్ని పరిధిలోని శ్రీ సాయి విద్యాలయంలో జరిగిన ఘటనలపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విద్యాసంస్థలకు సంబంధించిన సమస్యలు ఉంటే జిల్లా లేదా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని, విద్యార్థుల చదువులకు అంతరాయం కలిగించే విధంగా బంద్‌లు, నిరసనలు నిర్వహించవద్దని సూచించారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం విద్యాసంస్థలను బంద్ చేయించడం చట్టవిరుద్ధమని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

02 Jul 2026

Leave a Comment