మెదక్‌లో నల్ల పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహణ…

On: Sunday, June 21, 2026 7:59 PM

 

మెదక్ జిల్లా, మెదక్ విలేజ్ పరిధిలోని ఫతేనగర్ కాలనీలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నల్ల పోచమ్మ అమ్మవారికి బోనాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం సభ్యులు, కాలనీ ప్రజలు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధల మధ్య బోనాల వేడుకలు వైభవంగా కొనసాగాయి.

రిపోర్టర్: శ్రీకాంత్.

21 Jun 2026

Leave a Comment