ఎ9 న్యూస్, మాసాయిపేట, మే 8 :
మాసాయిపేట మండలం లోని శ్రీనివాస్ నగర్ లో 12వ వార్డులో మేజర్ సమస్యలు నెలకొన్నాయి. వేసవి కాలం కావడంతో, నీటి ఎద్దడి తో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బోరు బావులను మాసాయిపేట గ్రామ సర్పంచ్ వీరన్న గారి కృష్ణారెడ్డి ప్రెషర్ చేయించారు. 12వ వార్డు సభ్యులు ప్రశాంత్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పసుల వెంకటేశం, ఎర్ర స్వామి, ఎర్ర సంతోష్, ఎర్ర దశరథ, ఎర్ర నర్సింలు, కాలనీవాసులు పాల్గొన్నారు.








