
ఆర్మూర్, ఆగస్టు 15 (A9 న్యూస్ ప్రతినిధి):
ఆర్మూర్ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా, దేశభక్తి భావాలతో ఘనంగా నిర్వహించారు. సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందనం చేశారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను స్మరించి, వారి త్యాగాలను నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ విద్యార్థినులతో మాట్లాడుతూ, “మీరు విద్యలో ముందుకు సాగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి,” అని ఆకాంక్ష వ్యక్తం చేశారు. విద్యార్థినిలకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేయడం ద్వారా చదువుపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు.








