ఆర్మూర్‌లో ఐక్యత కోసం 2కే రన్….

On: Friday, October 31, 2025 12:34 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్‌లో ఐక్యత కోసం 2కే రన్

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దివాస్ వేడుకలలో భాగంగా ఆర్మూర్ పట్టణంలో “ఐక్యత కోసం 2కే రన్” నిర్వహించారు. శుక్రవారం ఉదయం మామిడిపల్లి కూడలి నుండి అంబేద్కర్ కూడలి వరకు ఉత్సాహంగా పరుగు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభసూచక జెండా ఆవిష్కరించారు. సీఐ సత్యనారాయణ గౌడ్, ఎస్సై అప్పారావు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఏసీపీ మాట్లాడుతూ — “సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహానుభావులు దేశ ఐక్యతకు ప్రాణం పెట్టారు. మనమూ వారి స్ఫూర్తితో ఐక్యతగా ముందుకు సాగాలి” అని పేర్కొన్నారు.

11 Nov 2025

Leave a Comment