హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన: అద్దె ఇంటి బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా కలకలం….

On: Saturday, October 18, 2025 1:10 PM

 

హైదరాబాద్‌ నగరంలోని మధురానగర్‌లో ఓ అద్దె ఇంట్లో సీక్రెట్ కెమెరా వ్యవహారం కలకలం రేపింది. జవహర్‌నగర్‌కు చెందిన అశోక్ అనే వ్యక్తి, తన ఇంటిని అద్దెకు ఇచ్చిన తర్వాత గోప్యంగా కెమెరాలు అమర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే — మధురానగర్‌లోని తన ఇంటిని అద్దెకు ఇచ్చిన అశోక్, ఓ ఎలక్ట్రీషియన్‌ చింటూ సహాయంతో అక్టోబర్ 4న బాత్‌రూమ్‌లోని బల్బు హోల్డర్‌లో సీసీ కెమెరా అమర్చాడు. ఈ చర్య వల్ల అద్దెకు ఉన్న దంపతుల గోప్యతకు తీవ్రంగా భంగం కలిగింది.

అక్టోబర్ 13న ఈ దంపతులు కెమెరాను గుర్తించి, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఇంటి యజమాని అశోక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి ఎలక్ట్రిషియన్ చింటూ పరారీలో ఉండటంతో పోలీసులు అతనిని వెతకుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధితుల గోప్యతకు భంగం కలిగించిన ఈ ఘటనపై స్థానికులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

గమనిక: ఇలాంటివి ఎదురైతే వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించాలి. మీ గోప్యతను కాపాడుకోవడం మీ హక్కు.

11 Nov 2025

Leave a Comment