1500 వందల సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులపై సంతకాలు చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ….

On: Saturday, October 18, 2025 7:47 PM

 

నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యలను తీర్చుతున్న రూరల్ ఎమ్మెల్యే.

నిజామాబాద్ గూపన్ పల్లి బైపాస్ లో గల రూరల్ క్యాంపు కార్యాలయంలో శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ఒకే రోజు 1500 ల సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులపై సంతకాలు చేశారు, నియోజకవర్గ ప్రజల క్షేమం కొరకు ప్రతినిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు నియోజకవర్గ ప్రజలు ఆనారోగ్య సమస్యల వల్ల ప్రైవేటు ఆసుపత్రిల్లో చూయించుకొని బిల్లు చెల్లించిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యే భూపతి రెడ్డి వద్ద దరఖాస్తు చేసుకోవడం జరుగుతున్నది,రికార్డు స్థాయిలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు వస్తున్నాయి, రాజకీయ పార్టీలకు అతీతంగా, ప్రజలకు కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందజేస్తూ, సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను స్వీకరించి, వేను వెంటనే హైదరాబాదులోని సచివాలయానికి పంపడం జరుగుతుంది, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రాగానే మండలాల గ్రామాల వారీగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అందజేస్తున్నారు…

11 Nov 2025

Leave a Comment