గ్రామానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించండి…..

On: Thursday, December 11, 2025 5:23 AM

 

సర్పంచ్ అభ్యర్థి మంగ్లారపు శ్రావణ్ :

“వన్నెల్ (కే) సమగ్ర అభివృద్ధి మా లక్ష్యం… లేడీస్ పర్స్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి”

వన్నెల్ (కే) గ్రామ పంచాయతీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజల సాధక–బాధకాలను ప్రతిబింబించే స్పష్టమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రకటించారు సర్పంచ్ అభ్యర్థి.

గ్రామంలోని తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం, దెబ్బతిన్న రహదారుల మరమ్మత్తు, కొత్త రోడ్ల ఏర్పాటు, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ వంటి ప్రాథమిక సౌకర్యాల బలోపేతం అత్యంత ప్రాధాన్యంగా చేపడతానని ఆయన తెలిపారు.

గ్రామ శుభ్రత, చెత్త నిర్వహణ, చెరువుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

పాఠశాలల మౌలిక వసతుల మెరుగుదల, ఆరోగ్య శిబిరాల ఏర్పాటు, యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు, రైతుల సంక్షేమం మరియు చిన్న వ్యాపారాల ప్రోత్సాహం గ్రామ భవిష్యత్ పురోగతికి అత్యంత అవసరమని ఆయన అన్నారు.

పంచాయతీ పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుత నిర్ణయాలు, ప్రజల భాగస్వామ్యంతో వన్నెల్ (కే) గ్రామ అభివృద్ధిని వేగవంతం చేస్తానని బలంగా నమ్ముతున్నానని అభ్యర్థి పేర్కొన్నారు.

“ఈ అన్నిటిని సాధించడానికి మీ బలం నాకు అవసరం. మీ అమూల్యమైన ఓటును లేడీస్ పర్స్ 👜 గుర్తుపై వేసి నన్ను ఆశీర్వదించండి” అని గ్రామ ప్రజలకు శ్రావణ్ పిలుపునిచ్చారు.

18 Jan 2026

Leave a Comment