రేపే మూడో విడత పంచాయతీ ఎన్నికలకు పోలింగ్….

On: Tuesday, December 16, 2025 2:58 PM

 

హైదరాబాద్:డిసెంబర్ 16

గ్రామపంచాయతీ ఎన్నికల పోరు ఆఖరి అంకానికి చేరుకుంది, జిల్లాలో రెండు విడుతల్లో 11 పంచాయతీ లు ఏకగ్రీవం కాగా 131 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి మూడో విడతలో మొత్తం 68 పంచాయతీ లకు 1 ఏకగ్రీవం కాగా 67 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు బుధవారం జరగనున్నాయి.

మూడో విడత ఎన్నికలకు సంబంధించి మొత్తం 4,157 గ్రామ పంచాయతీ లకు నోటిఫికేషన్ వెలువడింది, 11 సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాలేదు, 394 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి, మిగిలిన 3,752, సర్పంచ్ పదవులకు 12,640 మంది బరిలో ఉన్నారు.

36,434 వార్డులకు గాను 7,916 వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా..మిగిలిన 28,406, వార్డులకు75,283 మంది పోటీ పడుతున్నా రు.ఈ నేపథ్యంలో మూడో విడత ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి తొలి మలి విడతల్లో కొన్నిచోట్ల పోటాపోటీగా తలపడిన మరికొన్నిచోట్ల ఆ నైతిక పొత్తులతో ఫలితాలు వెలుపడ్డాయి.

అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు ఈ ఎన్నికల్లో విజయం సాధించి హస్తం హవా ను చాటారు. రెండో స్థానంలో బిఆర్ఎస్, ఉండగా బిజెపి, రెబెల్స్, మూడో స్థానంలో ఉన్నారు. కాగా…మూడో విడత ఎన్నికల్లో ఎవరికి ఎన్ని స్థానాలు దక్కుతయా నేది ఆసక్తికరంగా మారింది.

18 Jan 2026

Leave a Comment