అన్నారం గ్రామానికి కొత్త నాయకత్వం…..

On: Tuesday, December 23, 2025 10:17 AM

 

అన్నారం గ్రామ సర్పంచ్‌గా అట్టొలి సంజీవ్ ఘన విజయం.

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

అన్నారం గ్రామంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అట్టొలి సంజీవ్ సర్పంచ్‌గా ఎన్నికై ఘన విజయం సాధించారు. గ్రామ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ప్రజలకు ఇచ్చిన హామీలకు మద్దతుగా గ్రామ ప్రజలు ఆయనకు భారీ మెజార్టీతో పట్టం కట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం అన్నారం గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా అట్టొలి సంజీవ్‌ను గ్రామ పెద్దలు, యువత, అభిమానులు ఘనంగా సన్మానించారు. సర్పంచ్‌గా ఎన్నికైన అనంతరం అట్టొలి సంజీవ్ మాట్లాడుతూ, “నాపై నమ్మకం ఉంచి గెలిపించిన అన్నారం గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. వచ్చే ఐదు సంవత్సరాలు గ్రామాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలుకు అహర్నిశలు కృషి చేస్తాను” అని తెలిపారు.

18 Jan 2026

Leave a Comment