హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ ఆత్మహత్యా యత్నం..

On: Monday, December 22, 2025 10:07 AM

 

హైదరాబాద్, డిసెంబర్ 21 : హైదరాబాద్ హయత్‌నగర్‌ లో గన్‌మెన్‌ ఆత్మహత్యా యత్నం కలకలం రేపింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌, గన్ మెన్ గా పనిచేస్తున్న కృష్ణ చైతన్య,ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు గన్ మెన్ కృష్ణ చైతన్య, ఈరోజు ఉదయం ఇంట్లోనే తన వద్ద ఉన్న తుపాకితో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు కుటుంబ సభ్యులు వెంటనే చైతన్యను ఆసుపత్రిలో చేర్పించారు.అయితే అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

అందిన సమాచారం ప్రకారం. కృష్ణ చైతన్య ఇటీవలే ఓ బెట్టింగ్ యాప్‌లో భారీ మొత్తంలో డబ్బులను పొగొట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతడి ఆత్మహత్యకు ఆర్ధిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది. కాగా, గన్‌మ్యాన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తన గన్‌మ్యాన్ ఆత్మహత్య విషయం తెలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆస్పత్రికి చేరుకుని, అతని ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం రంగనాథ్ మాట్లాడుతూ. ఆర్థిక సమస్యల కారణంగానే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఈ విషయాన్ని సంచలనం చేయెద్దని తెలిపారు.

29 Jul 2026

Leave a Comment