హైదరాబాద్:అక్టోబర్ 23:
మేడ్చల్‌లోని పోచారంలో కాల్పులు కలకలం రేపాయి. ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ప్రాంతంలో ప్రశాంత్ సింగ్ సోను అనే వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఇబ్రహీం అనే వ్యక్తి కాల్పులు జరిపాడు అనంతరం నిందితుడు ఇబ్రహీం పరారయ్యాడు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఇద్దరి మధ్య ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? లేక రియల్ ఎస్టేట్ గొడవల అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
గాయాలైన సింగ్ సోనూ వెంచర్ నుంచి బయటకు వచ్చి కింద పడిపోవడంతో హోటల్ దగ్గర ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.








