ఆర్థిక ఇబ్బందులతో సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య…..

On: Monday, December 15, 2025 11:46 AM

 

హైదరాబాద్:డిసెంబర్ 15

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సర్పంచ్ పదవి కోసం లక్షలు, కోట్లు కుమ్మరిస్తు న్నారు. గతంలో చూడని విధంగా డబ్బు, మద్యం, గోల్డ్, సిల్వర్, గిఫ్ట్‌లు ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఉప సర్పంచ్ పదవి కీలకం కావడంతో.. వార్డు మెంబర్లు కూడా భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నారు.

వార్డు మెంబర్‌గా గెలవడానికి ఒక ఎత్తైతే.. ఉప సర్పంచ్ పదవి కోసం మరో ఎత్తు పోరాటం చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఎక్కడికక్కడ రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలు పెరిగిపోతున్నా యి. ఇవాళ్టితో రెండో విడత పంచాయతీ ఎన్నికలు పూర్తి కాగా.. బుధవారం రోజున మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని పిపడ్‌పల్లి గ్రామ పంచాయతీలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది, పంచాయతీ ఎన్నికల రెండో విడతలో భాగంగా పిపడ్‌పల్లి సర్పంచ్‌గా రాజు విజయం సాధించారు. అయితే ఈనెల 8వ తేదీన రాజు ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.

అయితే ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజుకు.. ప్రచారం చేసేందుకు చేతిలో డబ్బు లేదు. ఎన్నికల్లో ప్రచారానికి డబ్బులు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాజు.. ఇటీవల తన ప్రాణాలను తీసుకున్నాడు. ఈ ఘటన పిపడ్‌పల్లి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

18 Jan 2026

Leave a Comment