స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ విజయం ఖాయం…

On: Friday, October 10, 2025 7:45 AM

*స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ విజయం ఖాయం….

• ప్రజల్లోకి వెళ్లడానికి మరింత సమయం దొరికింది….

• సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి….

A9 న్యూస్ దుబ్బాక:

స్థానిక సంస్థల ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించ బోతున్నదని నియోజకవర్గ ఇన్చార్జ్ *చెరుకు శ్రీనివాస్ రెడ్డి* ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో ఏర్పాటు చేసిన దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట, నార్సింగి. మండలలకు సంబంధించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ

పార్టీ,ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారని ఆయన తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార శైలి, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడం, ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు ధీటుగా బదులివ్వడం, సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలను ఎదుర్కొని.ప్రజలకు నిజాలు తెలియజేయడం వంటి పలు అంశాలు సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు, నాయకులకు టికెట్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు.టికెట్ల కేటాయింపు విషయంలో పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.నాయకుల మధ్య సమన్వయ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్య క్రమాలను ప్రతి ఇంటికి చేరువ చేయాల న్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను బలంగా తిప్పికొడుతూనే, ప్రజలకు వాస్తవాలు తెలిపేలా కార్యకర్తలను సమాయత్తం చేయాలని ఆయన సూచించారు.

ఇట్టి కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐలపురం కనకయ్య యాదవ్, దౌల్తాబాద్ మండల అధ్యక్షుడు పడాల రాములు రాయపోల్ అధ్యక్షులు తప్పటి సుధాకర్, చేగుంట అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ నార్సింగ్ అధ్యక్షులు వినోద్ కుమార్ గుప్తా సీనియర్ నాయకులు కర్ణాల శ్రీనివాసరావు జిల్లా నాయకులు ఆత్మ కమిటీ డైరెక్టర్లు యూత్ కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

08 Nov 2025

Leave a Comment