గోదావరి ముంపు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వాన్ని వేడుకున్న చిన్నయానాం సర్పంచ్ వేముల లక్ష్మి…

On: Tuesday, December 23, 2025 5:00 PM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

గోదావరి ముంపు ప్రాంతంగా ఉన్న చిన్నయానాం గ్రామానికి ప్రత్యేకంగా అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసి, గ్రామాన్ని నిజామాబాదు జిల్లాలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దాలని చిన్నయానాం గ్రామ సర్పంచ్ వేముల లక్ష్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అలాగే తమ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు గోదావరి ముంపు గ్రామాల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారాలు చూపాలని కోరారు. ఈ సందర్భంగా వేముల లక్ష్మి మాట్లాడుతూ, “సాధ్యమైనంతవరకు చిన్నయానాం గ్రామ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషి చేస్తాను. గ్రామ ప్రజలు నాపై ఉంచిన నమ్మకానికి తగిన విధంగా సేవ చేసి వారి రుణాన్ని తీర్చుకుంటాను” అని స్పష్టం చేశారు.

18 Jan 2026

Leave a Comment