అజ్మీర్ షరీఫ్ దర్గాకు సీఎం రేవంత్ రెడ్డి చాదర్ సమర్పణ….

On: Monday, December 22, 2025 5:18 AM

హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి 814వ ఉర్సును పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్‌ను సమర్పించారు. అజ్మీర్ షరీఫ్ దర్గా ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, ప్రేమ, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన చాదర్ సమర్పణ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మహమ్మద్ షబ్బీర్ అలీ, ఎంపీ పోరిక బలరాం నాయక్, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

అలాగే TMREIS వైస్ చైర్మన్ ఫహీమ్ ఖురేషీ, తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ అఫ్జల్ ఖాద్రీ పాషా బియాబని, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌తో పాటు పలువురు ముస్లిం మైనారిటీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

18 Jan 2026

Leave a Comment