A9 న్యూస్ ప్రతినిధి నిజామాబాద్:
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం మిట్టాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళ. దాధాపుగా వయస్సు 25 నుండి 40 సంవత్సరాలు, అమానుషంగా హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది.
మృతదేహం తల, కుడి చేయి మణికట్టు వరకు లేకుండా దారుణంగా హతమార్చబడిన తీరు స్థానికులను, పోలీసులను షాక్‌కు గురి చేసింది.
ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పి.ఎస్. స్వయంగా సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పరిశీలించారు.
ఆయన సూచనల మేరకు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు ఆధారాల కోసం విస్తృతంగా సాక్ష్యాలను సేకరించాయి.
దోషులను అదుపులోకి తెచ్చేందుకు హుటాహుటిన 10 స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు.
ఈ విచారణలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట్ ఎస్సై సిహెచ్. తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








