
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవల్లో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున సంచార పశువైద్యశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంచార పశువైద్యశాలలు గ్రామాలలో తిరుగుతూ మూగజీవాలకు సేవలందిస్తూ రైతులకు నేరుగా వారి ముంగిట్లోనే అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నాయి.
టోల్ ఫ్రీ నెంబర్ 1962 కి రైతులు ఫోన్ చేయగానే, సంచార పశువైద్యశాల సిబ్బంది వెంటనే రైతు వద్దకు చేరుకొని, పశువుల ఆరోగ్య సమస్యలను రైతును అడిగి తెలుసుకుని తగిన వైద్యం అందించడంతో పాటు అవసరమైన మందులను కూడా అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ నియోజకవర్గం, ఆర్మూర్ మండలం ఇస్సపెల్లి గ్రామానికి చెందిన విభూషణ్ రెడ్డి గారి శ్రీ వెంకటేశ్వర ఆర్గానిక్ డైరీ ఫార్మ్ లోని పశువులకు ఈ రోజు సంచార పశువైద్యశాల సిబ్బంది వైద్యం అందించి, అవసరమైన సూచనలు ఇచ్చారు.
ఈ సేవల పట్ల డైరీ ఫార్మ్ యజమాని విభూషణ్ రెడ్డి గారు సంచార పశువైద్యశాల సిబ్బంది
డాక్టర్ కాంతయ్య, పారవేట్ అరుణ్ కుమార్, కెప్టెన్ సురేష్, హెల్పర్ సంతోష్ లను ప్రత్యేకంగా అభినందించారు.
అలాగే జిల్లా సమన్వయకర్త స్వరాజ్ గారు మరియు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్ గారు కూడా ఆర్మూర్ సంచార పశువైద్యశాల సిబ్బందిని వారి సేవలకుగాను ప్రశంసించారు.






