నికల్‌పూర్ గ్రామ సర్పంచ్‌గా బానోత్ అనిత సుమన్ ప్రమాణస్వీకారం
ఆర్మూర్, A9 న్యూస్ ప్రతినిధి:
అభివృద్ధికి నూతన అధ్యాయం
నికల్‌పూర్ గ్రామ సర్పంచ్‌గా బానోత్ అనిత సుమన్ సోమవారం అధికారికంగా ప్రమాణస్వీకారం చేసి గ్రామ పాలనకు శ్రీకారం చుట్టారు. గ్రామ ప్రజల అపార నమ్మకం, ఆశీస్సులతో ఈ బాధ్యతను స్వీకరించిన ఆమె, నికల్‌పూర్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తానని గట్టిగా ప్రకటించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వచ్చే ఐదు సంవత్సరాలు నికల్‌పూర్ అభివృద్ధి నా ప్రధాన ధ్యేయం. తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధితో పాటు బడుగు-బలహీన వర్గాలకు పూర్తి న్యాయం జరిగేలా అంకితభావంతో పనిచేస్తాను అని స్పష్టం చేశారు.
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, పారదర్శక పాలనతో గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేయడంతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు వార్డు మెంబర్లు రాజకీయ నాయకులు యువత పాల్గొన్నారు






