బోరు మోటార్ స్టార్ట్ చేస్తుండగా విద్యుత్ షాక్ – రైతు మృతి….

On: Tuesday, December 23, 2025 9:52 AM

 

A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆలూరు మండలం గుప్ప గ్రామానికి చెందిన బాషెట్టి భూమేశ్వర్ (54) అనే రైతు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన సోమవారం రోజు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, భూమేశ్వర్ తన కుటుంబ సభ్యులతో కలిసి గగ్గుపల్లి గ్రామ పరిధిలో ఉన్న తమ వ్యవసాయ భూమిలో పొలం పనులు చేస్తుండగా, పొలంలో ఉన్న బోరు మోటార్‌ను స్టార్ట్ చేసే సమయంలో అకస్మాత్తుగా చేతికి కరెంట్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైతు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

13 Mar 2026

Leave a Comment