ఆర్మూర్ పట్టణంలో రాత్రి తీవ్ర చలి కారణంగా వణుకుతూ ఉన్న 70–80 సంవత్సరాల వృద్ధురాలిని చూసి, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎల్.ఎస్. కుమార్ తన సేవాభావాన్ని చాటారు. వెంటనే ఒక బెడ్‌షీట్ తీసుకువచ్చి ఆ వృద్ధురాలికి కప్పి సహాయం చేశారు.
కేవలం అధికార విధులు మాత్రమే కాదు, మనుషుల పట్ల ప్రేమ, స్పందన చూపడం సమాజంలో ఎంతో అవసరమని ఆయన మరోసారి నిరూపించారు.
వేసవికాలంలో అడవుల్లో దాహంతో అలమటించే కోతులకు, ఇతర జంతువులకు ప్రతిరోజూ ఫలాలు, ఆహారం అందజేస్తూ వస్తున్నారు. ప్రకృతి, జంతువులు, మనుషుల పట్ల ఎల్.ఎస్. కుమార్ చూపుతున్న సేవాభావం చాలా మందికి ప్రేరణగా నిలస్తోంది.






