నూతన సర్పంచులను అభినందించిన – ఆవుల రాజిరెడ్డి…

On: Thursday, December 18, 2025 8:07 PM

ఎ9 న్యూస్, మాసాయిపేట, మెదక్, డిసెంబర్ 18:

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజక వర్గ పరిధిలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నర్సాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధే లక్ష్యంగా ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా సర్పంచులు సమిష్టిగా పనిచేయాలని కోరారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం మాసాయిపేట మండలం కేంద్రంలోని వివిధ గ్రామాల ప్రజలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

05 Feb 2026

Leave a Comment