ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ 5వ తెలంగాణ రాష్ట్ర కన్వెన్షన్ కరపత్రాల ఆవిష్కరణ…

On: Tuesday, December 16, 2025 8:02 PM

A9 న్యూస్ ఆర్మూర్:

ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ILPA) ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5వ తెలంగాణ రాష్ట్ర కన్వెన్షన్ కరపత్రాలను ఆర్మూర్ బార్ హాల్ నందు ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఆర్మూర్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ ముఖ్యంగా పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, న్యాయవాదుల వేదికగా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ కన్వెన్షన్ న్యాయ వ్యవస్థకు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుందని తెలిపారు.

ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ 5వ తెలంగాణ రాష్ట్ర కన్వెన్షన్ ఈ నెల 20వ తేదీన కొత్తగూడెంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ హైకోర్టు న్యాయమూర్తి వి. ఈశ్వరయ్య హాజరవుతుండగా, కొత్తగూడెం జిల్లా న్యాయమూర్తి పాటిల్ విశ్వనాథ్, ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి ఎస్. సరిత అతిథులుగా పాల్గొననున్నారు.

ఈ కన్వెన్షన్‌లో

*భారత రాజ్యాంగ విలువల రక్షణ

*మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల సంరక్షణ

*ఒకే దేశం – ఒకే ఎన్నిక అంశం

*మహిళల రాజ్యాంగబద్ధమైన ప్రాధాన్యత

బార్ మరియు బెంచ్ మధ్య గౌరవప్రదమైన సమన్వయం వంటి కీలక అంశాలపై చర్చలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కరపత్రాల విడుదల కార్యక్రమంలో కోశాధికారి గజ్జల చైతన్య, కృష్ణ పండిత్, బేతు జగదీష్, చిలుక కిష్టయ్య, కృష్ణంరాజు, కొండి పవన్, గణేష్, రాజేశ్వర్ రైతుల న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

03 Mar 2026

Leave a Comment