ఉమ్మెడ అభివృద్ధికి కాంగ్రెస్ అండ – ప్రచారంలో వినయ్ కుమార్ రెడ్డి హామీ….

On: Tuesday, December 16, 2025 6:54 AM

 

ఉమ్మెడ గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నక్కబోజేందర్ ని సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాభివృద్ధికి నిధుల వరదను పారిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అండతో ఉమ్మెడ గ్రామానికి అవసరమైన అన్ని అభివృద్ధి పనులకు ప్రభుత్వ నిధులు తీసుకువస్తామని భరోసా ఇచ్చారు.

ఉమ్మెడ గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరమని పేర్కొంటూ, నక్కబోజేందర్ ని భారీ మెజార్టీతో గెలిపించి బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు.

12 Mar 2026

Leave a Comment